సమ్మర్ స్పెషల్ బాగుంది.. కానీ పిల్లల సేఫ్టీ..?

సమ్మర్ స్పెషల్ బాగుంది.. కానీ పిల్లల సేఫ్టీ..?

హైదరాబాద్ : మండుతున్న ఎండలకు వాహనదారులు బయటికి రావడానికే భయపడుతున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సిన సమయంలో ఎండ నుంచి రక్షణ కోసం ఖర్చీఫ్, స్కార్ఫ్ లు పెట్టుకుంటున్నారు. నడుచుకుంటు వెళ్లేవారైతే గొడుగులు పట్టుకెళ్తున్నారు. అయితే ఓ బైకర్ ఇదే ఐడియాను వాడాడు. స్కూటీపై ఫ్యామిలీతో వెళ్తూ పిల్లలకు ఎండ తగలకుండా గొడుగు పెట్టాడు. కదలకుండా ఉండేట్లు సీటుకు గట్టిగా బిగించాడు. ఈ గొడుగు టూ వీలర్స్ కోసమే ప్రత్యేకంగా తయారుచేసినట్లు తెలుస్తుంది.

డ్రైవర్ తో పాటు వెనకాల కూర్చున్న వారికి కూడా ఎండ తగలకుండ మరింత వెడల్పుగా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతుండగా..సూపర్ ఐడియా అంటున్నారు నెటిజన్లు. ఎండ నుంచి రక్షించుకోవడానికి ఆటోలపై పచ్చికను ఏర్పాటు చేసిన ఫొటోలు కూడా ఇటీవల బాగా వైరల్ కాగా.. ప్రస్తుతం బైకర్ అంబ్రెల్లాలు వచ్చాయన్నమాట అంటున్నారు. అయితే గొడుగు పెట్టుకున్నప్పడు డ్రైవింగ్ కాస్త జాగ్రత్త సుమా..! డ్రైవర్ కు గొడుగు ఏ మాత్రం కళ్లముందుకు వచ్చినా అందరూ పడిపోయే ప్రమాదం ఉంది.