ఇన్‌‌స్పైర్ చేసే బైకర్

ఇన్‌‌స్పైర్ చేసే బైకర్

‘బైకర్’లో పెర్ఫార్మెన్స్‌‌కి స్కోప్ ఉన్న ఇంపాక్ట్‌‌ఫుల్ క్యారెక్ట్ చేశానంది మాళవిక నాయర్.  శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మాళవిక నాయర్ చెప్పిన  విశేషాలు. ‘‘ఇండియాలో  ఫస్ట్  మోటోక్రాస్ ఫిల్మ్ ఇది.  ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్‌‌గా ఉన్నా. కథ మూడు టైమ్‌‌లైన్స్‌‌లో సాగుతుంది.   ఇందులో నా పాత్ర కథకు  బ్రిడ్జ్‌‌లా ఉంటుంది. 

ఒక స్పోర్ట్స్‌‌మెన్  జీవితంలో ఫ్యామిలీ రోల్ చాలా కీలకం.  ఇందులో శర్వాకు వైఫ్‌‌గా కనిపిస్తా. రియల్ లైఫ్‌‌లో శర్వా, నేను ఇంట్రోవర్ట్స్. పెద్దగా మాట్లాడుకోము. కానీ సినిమాలో క్యారెక్టర్ల పరంగా మంచి కెమిస్ట్రీ కుదిరింది. రాజశేఖర్ గారితో  కలిసి నటించడం మంచి అనుభవం.

అభిలాష్ రెడ్డి క్లారిటీ ఉన్న డైరెక్టర్. అనుకున్న టైమ్‌‌లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు.  జిబ్రాన్ అందించిన మ్యూజిక్ కచ్చితంగా మంచి హై ఇస్తుంది. ఈ చిత్రంలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఫాదర్ అండ్ -సన్ ఎమోషన్ ప్రత్యేకంగా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో ప్రేక్షకులను ఇన్‌‌స్పైర్ చేసేలా సినిమా ఉంటుంది.

యూత్‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ ఎమోషనల్‌‌గా కనెక్ట్ అవుతుంది.  ఇక  నా జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నా. డిఫరెంట్ లేయర్స్ ఉన్న పాత్రలే  చేయాలనుకుంటున్నా.  ఆ క్యారెక్టర్ నాకు పర్సనల్‌‌గా కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాను. కొత్తగా అనిపిస్తే కచ్చితంగా చేస్తా’’.