నాలాల్లో కొట్టుకుపోతున్న బైక్స్.. వెంటపడి వెతికి తెచ్చుకుంటున్న వాహనదారులు

నాలాల్లో  కొట్టుకుపోతున్న బైక్స్..  వెంటపడి వెతికి తెచ్చుకుంటున్న వాహనదారులు

హైదరాబాద్లో వర్షానికి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వరద ఉదృతికి నాలాల్లో బైకులు నీటితో పాటే వెళ్లిపోయాయి. బైకులు కొట్టుకుపోవడంతో యజమానులు వాటి వెంట పరిగెత్తారు. వరదల ధాటికి కొట్టుకుపోతున్న బైకులను ఆపలేక వాహనదారులు తంటాలు పడ్డారు. మరోవైపు కొన్ని బైకులు నాలాల్లో పడిపోయాయి. నాలాల్లోని బైకులను గుర్తించేందుకు యజమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. చివరకు బండి నెంబర్ల ఆధారంగా గుర్తుపట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో తెచ్చుకున్నారు. 

సిబ్బంది తంటాలు..

వరద ధాటికి కొట్టుకుపోయిన బైకులను తీసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తంటాలు పడ్డారు. నీరు ఉదృతంగా ప్రవహిస్తున్నా..లేక్కచేయకుండా నాలాల్లోకి దిగారు. బైకులకు తాడులు కట్టి పైకి తీశారు. ఒక్కొక్కటిగా పైకి లేపారు. 

కార్లు సైతం...

సికింద్రాబాద్ నల్లకుంట పద్మకాలనీ వీధుల్లో అయితే సునామీ తరమాలో వరద ప్రవహించటం కాలనీ వాసులను భయాందోళనలకు గురి చేసింది. ఈ వరదకు బండ్లు, కార్లు కొట్టుకుపోయాయి.  రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాల అడ్రస్ గల్లంతు అయ్యింది. పద్మకాలనీలో నాలా పనులు జరుగుతుండటంతో.. రోడ్ల పక్కన ఉన్న కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. వరద ప్రవాహానికి బైక్స్, కార్లు నాలాలోకి కొట్టుకొచ్చాయి. గంటపాటు ఏం జరుగుతుందో అర్థం కాక.. ఇల్లు కూలిపోతాయా అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు పద్మకాలనీ వాసులు.