48ఏళ్ల నాటి తన రెజ్యూమ్ను షేర్ చేసిన బిల్ గేట్స్  

48ఏళ్ల నాటి తన రెజ్యూమ్ను షేర్ చేసిన బిల్ గేట్స్  

చదువు కంప్లీట్ అయ్యాక జాబ్ లో చేరాలనుకునేవారు ముందు చేసే పని రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటే..జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. తమ విద్యార్హతలు, నైపుణ్యాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలతో రెజ్యూమ్ రెడీ చేసుకుంటారు. అయితే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్..తన కేరీర్ తొలినాళ్లలో తయారుచేసుకున్న రెజ్యూమ్ ను లింక్డ్ ఇన్ వేదికగా షేర్ చేశారు. 1974నాటి తన రెజ్యూమ్ లో ఒక్క పేజీలోనే తనకున్న అర్హతలేంటో సూటిగా చెప్పేశాడు. 

ఇక బిల్ గేట్స్ షేర్ చేసిన తన 48ఏళ్ల రెజ్యూమ్ లో ఆయన పేరు విలియం హెచ్ గేట్స్  అని, హార్వర్డ్ కాలేజీలో తొలి సంవత్సరం చదువుతున్నట్టుగా ఉండడం గమనించొచ్చు. వాటితో పాటు ఆయన నేర్చుకున్న కోర్సుల వివరాలు, సాఫ్ట్ వేర్ కి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఆయన తన రెజ్యూమ్ లో చేర్చారు. ఇన్ని సంవత్సరాలైనా బిల్ గేట్స్.. తన కెరీర్ తొలి నాళ్లలోని రెజ్యూమ్ ను ఇంత జాగ్రత్తగా ఉంచుకోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తు్న్నారు. దీంతో ఈ రెజ్యూమ్ వైరల్ గా మారింది.

మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్ గేట్స్ గురించి తెలియని వారుండరు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డ్రాపవుట్ అయిన బిల్ గేట్స్..ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేయకముందే బిల్ గేట్స్..సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధించిన అన్ని టెక్నిక్స్ నూ నేర్చుకున్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసి ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు.