పౌలాహర్డ్‌తో ప్రేమలో పడ్డ బిల్ గేట్స్

 పౌలాహర్డ్‌తో  ప్రేమలో పడ్డ బిల్ గేట్స్

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డారు. 30 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2021లో భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో విడాకులు తీసుకున్న బిల్ గేట్స్.. ప్రస్తుతం ఒరాకిల్ సీఈఓ మార్క్ షర్డ్ మాజీ భార్య పౌలాహర్డ్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మార్క్ హర్డ్ 2019లో క్యాన్సర్ తో మరణించడంతో అప్పట్నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. పౌలా హర్డ్ ఈవెంట్ ప్లానర్ గా, టెక్ ఎగ్జిక్యూటివ్ గా, సామాజిక సేవకురాలిగా పనిచేస్తున్నారు. పౌలా, మార్క్ దంపతులకు కాథరిన్, కెల్లీ అనే కుమార్తెలున్నారు. తాజాగా అయితే 67 ఏళ్ల బిల్ గేట్స్ 60 ఏండ్ల పౌలా హర్డ్ తో డేటింగులో ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

బిల్, పౌలాలకు టెన్నిస్ అంటే ఇష్టం ఉండడంతో గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ జంట పక్కపక్కనే కూర్చొని ఆటను చూశారు. దీనికి సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వారిద్దరి మధ్య విడదీయరాని బంధం ఉందని వీరి స్నేహితుల్లో ఒకరు వెల్లడించారు. ఏదేమైనా లేటు వయసులో బిల్, పౌలాల ప్రేమాయణం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.