ప్రధాని మోదీతో బిల్‌గేట్స్ భేటీ.. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌పై చర్చ 

ప్రధాని మోదీతో బిల్‌గేట్స్ భేటీ..  ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌పై చర్చ 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని మోదీ ఇంట్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈభేటీలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, వాతావరణంలో మార్పులు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్టర్ వంటి వాటి గురించి ఇరువురు చర్చించారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ తీసుకొచ్చిన మార్పులను బిల్‌గేట్స్‌  మెచ్చుకున్నారు. భారతీయులు టెక్నాలజీని వేగంగా నేర్చుకున్నారని ఆయన అన్నారు. సాంకేతికరంగంలో భారత్ వేగంగా దూసుకెళ్తుదంని బిల్ గేట్స్ అన్నారు.

ప్రధాని మోదీతో ఆయన ఓ సెల్ఫీ తీసుకున్నారు. G-20 సదస్సులో AI టెక్నాలజీని వాడుకున్నామని చెప్పిన ప్రధాని నమో యాప్‌ను ఎలా ఉపయోగించాలని గేట్స్‌కు వివరించారు. చాట్‌ జీపీటీ వినియోగం మంచిదేనని కానీ, అది సోమరితనానికి దారి తీస్తోందని సూచించారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రారంభమై 25 ఏళ్లు గడిచిందని బిల్‌గేట్ తెలిపారు. 

ఇక డేటా వినియోగం గురించి మోదీ మాట్లాడుతూ.. ప్రైవసీని దెబ్బతీయకుండా డేటా వినియోగం జరగాలన్నారు. రీసెర్చ్‌ డేటా వాడుకునే సమయంలో.. డేటా యజమానికి ఈ విషయం తెలియాలని అన్నారు.  భారత్‌లో టెక్నాలజీ వినియోగం తీరుతెన్నులను ప్రధాని బిల్‌గేట్స్‌కు వివరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిమించడానికి టెక్నాలజీని వాడాలని అనుకుంటున్నామని మోదీ ఆయనతో అన్నారు.

ఇక వీరిద్దరి మధ్య పర్యావరణ పరిరక్షణపై చర్చ జరిగింది. సన్‌రైజ్‌ సెక్టార్ల కోసం రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు ప్రధాని తెలిపారు. జీవనశైలిలో మార్పుల కోసం మిషన్‌ లైఫ్‌ తీసుకొచ్చామన్నారు. విద్యుత్‌, ఉక్కు వినియోగం పర్యావరణ విరుద్ధం అన్ని మోదీ గ్రీన్‌ జీడీపీ వృద్ధి చేసుకోవడంలో దృష్టిపెడుతున్నామని గేట్స్ తో చెప్పారు. సిరిధాన్యాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం మిల్లెట్స్‌ ఉత్పత్తిపై పెద్ద కంపెనీలు దృష్టిపెట్టాయన్నారు. ఇక సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ గురించి కూడా బిల్‌గేట్స్‌కు మోదీ వివరిచారు.