కరెంట్ మీటరే లేకున్నా లక్ష రూపాయల బిల్లు

కరెంట్ మీటరే లేకున్నా లక్ష రూపాయల బిల్లు
  • మర్రిగూడెం, కామారం ఆస్పత్రులకు లక్ష చొప్పున బిల్లు

మహబూబాబాద్ జిల్లా:  విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు లేకున్నా.. లక్షల రూపాయల బిల్లు ఇచ్చారు. కనెక్షన్లు లేకుండా లక్షల బిల్లును చూసి ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
జిల్లాలోని మర్రిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 12 ఏళ్లుగా  కరెంట్ మీటర్ లేదు. సిబ్బంది ప్రశ్నించడంతో ఇటీవలే మీటర్ బిగించారు. ఆ తర్వాత రెండున్నర లక్షల బిల్లును చేతులో పెట్టారు విద్యుత్ అధికారులు. కామారం  ఆసుపత్రిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్నిరోజులుగా  టార్చిలైట్ వెలుతురులో వైద్యం చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. ఇటీవల రెండు మీటర్లు బిగించి రెండున్నర లక్షల రూపాయల బిల్లు వేశారు విద్యుత్ అధికారులు. కరెంట్ బిల్లులు కలెక్ట్ చేయడంలో చూపిన ఆసక్తి ..విద్యుత్ సరఫరా చేయడంలో లేదని వైద్యసిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.