రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్ 1 పరీక్షకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ కు టీఎస్పీఎస్సీ తొలిసారి బయో మెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తెచ్చింది. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో బయో మెట్రిక్ ట్యాబ్ లు పనిచేయడం లేదు. సగానికిపైగా అభ్యర్థుల థంబ్స్ ను ట్యాబ్ తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పరీక్షకు సమయం దగ్గరపడుతుండటం మరోవైపు థంబ్ అటెండెన్స్ లో ఇబ్బందులు ఎదురవుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
నిజాం కాలేజీలో గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు థంబ్ పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో అభ్యర్థి ఎన్నిసార్లు వేలిముద్రలు వేసినా పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ట్యాబ్ లో ఇబ్బందులు తలెత్తడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్ లో వేచి చూస్తున్నారు. పరీక్ష సమయం అవుతున్నందున తొందరగా పంపాలని కోరుతున్నారు. అధికారుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
