ఫుడ్డు కాదు.. సిగరెట్​ అని దానికి చెప్పేదెవరు?

ఫుడ్డు కాదు.. సిగరెట్​ అని దానికి చెప్పేదెవరు?

అది ఆహారం కాదు.. సిగరెట్​ పీక అని ఆ పక్షికి, ఆ పిల్ల పక్షికి చెప్పేదెవరు? అది మింగితే కడుపు నిండడం అటుంచి, కడుపు నొస్తుందని అర్థమయ్యేట్టు ఎవరు చెప్తారు? పాపం ఫుడ్​ అనుకుని తన పిల్లకు ఈ స్కిమ్మర్​ పక్షి ఎవరో కాల్చి పడేసిన సిగరెట్​ పీకను తీసుకెళ్లి నోట్లో పెట్టింది. దాన్ని పట్టుకుని ముందుకు నడిచింది ఆ బుల్లి స్కిమ్మర్​. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సెయింట్​ పీటర్స్​బర్గ్​ బీచ్​లో కనిపించిందీ దయనీయమైన చిత్రం. మనిషి పనులు మూగజీవాలకు ఎంత ప్రాణసంకటంగా మారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.