పుట్టంగనే కులం సర్టిఫికెట్!

పుట్టంగనే కులం సర్టిఫికెట్!

బర్త్‌ సర్టిఫికెట్ తో పాటే ఇచ్చే ఆలోచన

కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు

ప్రత్యేక సాఫ్ట్‌‌‌‌వేర్‌ రూపకల్పనలో నిమగ్నం

ఐదారు నెలల్లో అందుబాటులోకి

హైదరాబాద్ : క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ పొందడం మరింత సులభతరం కానుంది. పంచాయతీ, రెవెన్యూ ఆఫీసుల్లో బర్త్‌‌ సర్టిఫికెట్‌‌తో పాటే కులం సర్టిఫికెట్‌ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌‌ వేర్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం. మరో ఐదారు నెలల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.

ఇందుకోసం రెవెన్యూ శాఖలో సరికొత్త సాంకేతిక విధానాన్ని తీసుకురానున్నారు. ఇకపై బిడ్డ జన్మించగానే బర్త్ సర్టిఫికెట్‌‌తో పాటు కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయనున్నారు. ప్రభుత్వ శాఖలన్నిం టికీ లింక్‌‌‌‌‌‌‌‌ప్రస్తుతం బిడ్డ జన్మిం చగానే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేదా ప్రభుత్వాసుపత్రులు ఎలా బర్త్ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ను ఇస్తున్నాయో అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లో పొందుపరుస్తారు.

ప్రభుత్వ శాఖలన్నింటిలో ఈ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటాయి. బిడ్డ పెద్దయ్యాక పాఠశాలకు వెళ్లినప్పుడు క్యాస్ట్ , ఆధార్ వివరాలను దరఖాస్తులో పొందుపర్చితే సరిపోతుంది. పాఠశాల యాజమాన్యం ఆ వివరాలను నమోదు చేసుకునేటప్పుడు ఆ విద్యార్థి కులం ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌గా నమోదయ్యేలా కొత్త విధానం ఉంటుందని తెలుస్తోంది. ఇదే విధానంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆధార్ కార్డు ద్వారా రాష్ట్రంలోని అందరి వివరాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కొంచెం అప్‌ డేట్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు