ఆ బిరుదులతో పిలవొద్దంటున్న స్టార్ హీరోలు

ఆ బిరుదులతో పిలవొద్దంటున్న స్టార్ హీరోలు

క్లాస్, మాస్ అంటూ పిలవకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో రఫ్ ఆడించే వాడే స్టార్ హీరో. కొన్ని ప్లాపులు వచ్చినా ఫ్యాన్స్ బేస్ ఏ మాత్రం తగ్గని వాడే స్టార్. ఎన్ని అపజయాలు వచ్చినా ఒక్క హిట్ తో సత్తా చూపించేవాడే స్టార్ అవుతాడు. ఇలాంటి స్టార్లను అభిమానులు ముద్దుగా  వివిధ పేర్లతో పిలుచుకుంటుంటారు.. ఈ బిరుదుతో హీరో పేరు వెండితెరపై ప్రత్యక్షం అవటంతో ఫ్యాన్స్ కేకలు, అరుపులతో రచ్చ రచ్చ చేస్తారు. అయితే కొందరు స్టార్లు తమ బిరుదులను సార్ధకం చేసుకోలేకపోతున్నారు. అలాంటి కొందరి గురించి తెలుసుకుందాం..

అమీర్ ఖాన్ (మిస్టర్ పర్ఫెక్ట్)

అమీర్ ఖాన్ అంటేనే మిస్టర్ పర్ఫెక్ట్.. సినిమా కోసం ఏ మాత్రం రాజీ పడకుండా హార్డ్ వర్క్ చేస్తాడు. టెక్నీషియన్లతో పాటు, నటీనటులను కూడా పిండి పడేస్తాడు. కథ, కథనం దగ్గర నుండి టెక్నికల్ విషయాల వరకు అన్నీ దగ్గర ఉండి చూసుకుంటాడు. అందుకే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా మారాడు. ఇలాంటి పర్ఫెక్ట్ మ్యాన్ గత కొంత కాలంగా పర్ఫెక్షన్ చూపించలేకపోతున్నాడు. అంచనాలతో భారీ బడ్జెట్లో వచ్చిన 'థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్' బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా జండుబామ్ లకు పని చెప్పింది. సరే ఓ ఫ్లాప్ కామన్ అనుకుంటే.. రీసెంట్ గా వచ్చిన 'లాల్ సింగ్ చడ్డా'తో మరోసారి ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచాడు. అసలు మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇదేనా అంటూ అనుమానపడేలా అమీర్ ఖాన్ చేస్తున్నాడు.

షారుక్ ఖాన్ (బాలీవుడ్ బాద్షా)

ఇక షారుక్ ఖాన్ ను కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకొని అభిమానులు మురిసిపోతారు. గత కొంత కాలంగా బాలీవుడ్ బాద్షా అడ్రస్ గల్లంతైందని చెప్పుకుంటున్నారు. చిన్న హీరోల సినిమా వసూళ్లు కూడా షారుక్ మూవీలు రాబట్టలేకపోతున్నాయని టాక్ వినిపిస్తోంది. తాను ఎందుకు బాలీవుడ్ కు బాద్షానో వచ్చే సినిమాలతోనైనా షారుక్ నిరూపిస్తాడని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మోహన్ బాబు (కలెక్షన్ కింగ్) 

ఇక పెదరాయుడు లాంటి సినిమాలతో.. బిగ్ కలెక్షన్లు కొల్లగొట్టి కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు మారాడు. అయితే ఈయన గత సినిమాలు వచ్చినట్టే వచ్చి వెళ్లి పోయాయి. ఇక 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా మీద ఏ రేంజ్ లో ట్రోల్స్ నడిచాయో తెలుసు. పది లక్షలు కూడా ఈ కలెక్షన్ కింగ్ మూవీ రాబట్టలేకపోవటం గమనార్హం.

 పవన్ కళ్యాణ్ (పవర్ స్టార్ )

పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అంటూ అభిమానులు పిలుచుకుంటారు. అయితే ఏ పవర్ లేని నాకు పవర్ స్టార్ ఏంటీ అంటు తనను అలా అనొద్దని రిక్వెస్ట్ చేశాడు. అలాగే నానికి కూడా నాచులర్ స్టార్ అని పిలిపించుకోవాలని లేదట. వెండితెర మీద స్టైలిష్ గా ఆకట్టుకుని స్టైలీష్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇక మీద తన ముద్ర చూపించాలి అనుకుంటున్నాడు. అందుకే ఐకాన్ స్టార్ గా మారాడు.

నాగార్జున (కింగ్)

ఇక కొందరు స్టార్లు కొద్దిగా జాగ్రత్త పడి తమ బిరుదులను మార్చేసుకున్న మ్యాటర్ తెలుసు. యంగ్ ఏజ్ లో బాలకృష్ణ యువ రత్నగా, నాగార్జున యువ సామ్రాట్  గా పిలిపించుకున్నారు. ఇప్పుడు ఏజ్ పెరగడంతో నటసింహాం, కింగ్ లాంటి బిరుదులోకి మారారు ఈ హీరోలు.