స్విగ్గీలో సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు

స్విగ్గీలో సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు

మనోళ్లు బిర్యానీ తెగ తింటున్నరు. స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్లు వెల్లువెత్తడమే దీనికి నిదర్శనం. సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. ఈ ఏడాది (2022)లో అత్యధికంగా ఆర్డర్లు తెచ్చుకున్న ఫుడ్​ ఐటమ్​గా బిర్యానీ నిలిచింది. ఇక పాపులర్​ ఫుడ్​ ఛాయిసెస్​ కేటగిరీలో చూస్తే ఇటాలియన్​ రావియోలి (ఒక రకమైన పాస్తా), కొరియన్​ బిబిమ్​బాప్​ (రైస్​ డిష్​) నిలిచాయని ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్​ స్విగ్గీ వెల్లడించింది. 

రూ. 71 వేలకు బర్గర్లు, ఫ్రైస్​ ఆర్డరు.... 

గత ఏడాది కాలంలో లక్షకు పైగా రెస్టారెంట్లు, క్లౌడ్​ కిచెన్లు తమతో చేతులు కలిపినట్లు స్విగ్గీ తెలిపింది. దీపావళి సందర్భంగా బెంగళూరు నుంచి రూ. 75,378 విలువైన సింగిల్​ ఆర్డరు వచ్చిందని పేర్కొంది. పూణె నుంచి మరో కస్టమర్​ తన టీమ్​ కోసం రూ. 71,229 విలువైన బర్గర్లు, ఫ్రైస్​ కోసం ఇంకో ఆర్డరు ఇచ్చారని తెలిపింది. శ్రీనగర్​, పోర్ట్​ బ్లెయిర్​, మున్నార్​, ఐజ్వాల్​, జల్నా, భిల్వారా వంటి సిటీలలోని కస్టమర్లు తమ తొలి ఆర్డర్లను స్విగ్గీలో ప్లేస్​ చేసినట్లు వివరించింది. స్విగ్గీ వన్​ ఆఫరింగ్​తో ఎక్కువగా సేవ్​ చేసుకున్న సిటీగా బెంగళూరు నిలిచిందని, ఈ సిటీలోని మెంబర్లు దాదాపు రూ. 100 కోట్లు ఆదా చేసుకున్నారని స్విగ్గీ వెల్లడించింది. ఆ తర్వాత ప్లేసులలో ముంబై, హైదరాబాద్​, ఢిల్లీ సిటీలున్నాయని పేర్కొంది. ఢిల్లీ నుంచి ఒక స్విగ్గీ వన్​ మెంబర్​ ఏకంగా రూ. 2.48 లక్షలు ఆదా చేసుకున్నట్లు వివరించింది. స్విగ్గీ వన్​ మెంబర్​షిప్​ కింద ఫ్రీ డెలివరీలు, ఆకర్షణీయమైన ఆఫర్లతోపాటు, ఇతర ప్రివిలైజెస్​నూ స్విగ్గీ అందిస్తోంది. 

టిప్పులు రూ. 53 కోట్లు..

ఈ ఏడాది కాలంలో 35 లక్షల మంది కస్టమ ర్లు తమ డెలివరీ పార్ట్​నర్స్​కు టిప్స్​ అందించినట్లు కూడా స్విగ్గీ వెల్లడించింది. ఇలా టిప్పు ల రూపంలో మొత్తం రూ. 53 కోట్లు వచ్చిం దని, అదంతా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్​ చేతికే వెళ్లిందని కంపెనీ వివరించింది. గిల్ట్​‑ఫ్రీ ఫుడ్​ ఆప్షన్స్​ కోసం సెర్చ్​లు 23 శాతం ఎక్కువయ్యాయని తెలిపింది. మధ్యాహ్నం టైములోనే ఎక్కువ మంది గిల్ట్​ ఫ్రీ డిషెస్​ కావాలనుకున్నట్లు పేర్కొంది. స్విగ్గీ గార్మెట్​ ఆర్డర్లలో 30 శాతం ముంబై వాసుల నుంచే వచ్చినట్లు తెలిపింది. బెంగళూరు నుంచి ఒక కస్టమరు ఒకే వారంలో 118 గార్మెట్​ ఆర్డర్లను ఇచ్చినట్లు వెల్లడించింది. మరోవైపు స్విగ్గీ ఇన్​స్టామార్ట్​కు టీ ఆర్డర్లు 305 శాతం, కాఫీ ఆర్డర్లు 273 శాతం పెరిగినట్లు పేర్కొంది. 2014 లో ఏర్పాటయిన స్విగ్గీ ప్రస్తుతం దేశంలోని వందలాది సిటీలకు విస్తరించింది. 2 లక్షల రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తోంది. 25 సిటీలలో క్విక్​ కామర్స్​ గ్రోసరీ సర్వీస్​ ఇన్​స్టామార్ట్​ తన సేవలను అందిస్తున్నట్లు స్విగ్గీ వెల్లడించింది.