పెరిగిన ఎల్‌‌‌‌ అండ్ టీ డేటా సెంటర్ కెపాసిటీ

పెరిగిన ఎల్‌‌‌‌ అండ్ టీ డేటా సెంటర్ కెపాసిటీ

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్  కంపెనీ  లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌‌‌‌ అండ్ టీ) ఈ ఏడాది మార్చి చివరినాటికి 18 మెగావాట్స్‌‌‌‌  కెపాసిటీ గల డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది.  దీంతో సంస్థకి చెందిన మొత్తం ఆపరేషనల్ సామర్థ్యం 32 మెగావాట్స్‌‌‌‌కి చేరుతుంది. ఈ ప్రాజెక్టు కోసం  సుమారు రూ.వెయ్యి కోట్లను ఇన్వెస్ట్ చేసింది.   ఎల్ అండ్ టీ సెమీకండక్టర్ బిజినెస్‌‌‌‌లో  డిజైన్ ఆధారిత చిప్‌‌‌‌లపై దృష్టి పెట్టి, అనేక కస్టమర్లతో పనిచేస్తోంది. ఎలక్ట్రోలైజర్ బిజినెస్‌‌‌‌లో ఇప్పటికే  4 మెగావాట్స్‌‌‌‌ స్వదేశీ స్టాక్‌‌‌‌ను అభివృద్ధి చేసి, దీనిని 8-–10 మెగావాట్స్‌‌‌‌కి అప్‌‌‌‌గ్రేడ్ చేస్తోంది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  కంపెనీ  లాభం 4.2శాతం తగ్గి రూ.3,215 కోట్లకు చేరింది.  కొత్త కార్మిక చట్టాల కారణంగా ఉద్యోగి ప్రయోజనాలపై రూ.1,191 కోట్ల ఒకసారి ప్రొవిజన్ జరిపింది.

అనంత్ రాజ్‌‌‌‌, సబ్‌‌‌‌మర్‌‌‌‌ జత

ఇండియాలో డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థ అనంత్ రాజ్ లిమిటెడ్, ఏఐ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ సబ్‌‌‌‌మర్‌‌‌‌తో భాగస్వామ్యం  కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి అనంత్ రాజ్ క్లౌడ్,  సబ్‌‌‌‌మర్ మధ్య ఎంఓయూ జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా హై డెన్సిటీ హై ఎఫిషియెన్సీ కంప్యూటింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లను  వేగంగా ఏర్పాటు చేస్తారు. స్పెయిన్ నుంచి లిక్విడ్-కూలింగ్ టెక్నాలజీని భారత ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌తో కలిపి ఏఐ వర్క్‌‌‌‌లోడ్స్‌‌‌‌కు మద్దతు ఇస్తామని అనంత్ రాజ్ పేర్కొంది.