హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని జాన్వాడలో 31వ గనుల పర్యావరణ, ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ (అదానీ సిమెంట్) నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల సంస్థలకు పురస్కారాలు అందజేశారు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ పంకజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాస్త్రీయ గనుల తవ్వకాలు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 35 గనులను అధికారులు
సమీక్షించారు.
