ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్​..

 ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో  ప్లేట్లలో బిర్యానీ సేల్స్​..

రాముడి పేరు చెబితే హిందువులు పులకరించి పోతారు. ఇప్పటి వరకు రాజకీయాలకు వాడుకున్న శ్రీరాముడిని .... తాజాగా వ్యాపార రంగంలోకి దించారు.  అది అట్లాంటి ఇట్లాంటి వ్యాపారం కాదండోయ్​... బిర్యానీ బిజినెస్​అండీ.. ఆ హోటల్​ కు రాముడి పేరు పెట్టారకుంటున్నారా.. అది కాదండి.. వ్యాపారం రంజుగా సాగేందుకు ఆ యజమాని  రాముడి పేరుతో చేసిన ఆలోచన ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

ఢిల్లీలోని జహంగీర్​ పురిలో  ఓ బిర్యానీ వ్యాపారం  సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.   ఆ బిర్యానీ దుకాణం దగ్గర జనాలు బాగా రద్దీగా ఉన్నారు.  బహుశా అక్కడ టేస్ట్​ బాగా ఉందని జనాలు బిర్యానీ కోసం గుమికూడారు అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.   అక్కడ బిర్యానీ ఇచ్చే ప్లేట్లపై రాముడి చిత్ర పటం ఉంది.   రాముడిని వ్యాపారం కోసం ఇట్లాగా కూడా వాడుకుంటారా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read:భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..

బిర్యానీ హోటల్​ యజమాని  రాముడి చిత్రపటం ఉన్న ప్లేట్లలో  బిర్యానీ అమ్మడాన్ని కొంతమంది స్థానికులు భజరంగదళ్​ సభ్యులు  వ్యతిరేకించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.  హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఆ హోటల్​ యజమాని ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  పేపర్​ ప్లేట్ల బండిల్​ లో  కొన్ని ప్లేట్లపై రాముడి చిత్రపటం ఉందని తెలిపారు.  ఈ ఘటనపై జహంగీర్​ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటన  స్థానికంగా కలకలం రేగింది. నిందితులు వ్యాపారాన్ని పెంచుకునేందుకు చేశారా.. లేదా ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  తినుబండారాల విషయంలో కూడా మత విశ్వాసాలను దెబ్బతీసే ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.