సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ లీడర్​ మహేశ్వర్ రెడ్డి

సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ లీడర్​ మహేశ్వర్ రెడ్డి
  • ఢిల్లీ లెవల్​లో లాబీయింగ్​
  • బీజేఎల్పీ లీడర్​ మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం కుర్చీపై పడిందనిపిస్తుందని బీజేఎల్పీ లీడర్​మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయనతో కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాదిరిగా తెలంగాణలో పొంగులేటి వ్యవహరిస్తున్నాడని అన్నారు.  ఢిల్లీ లెవల్లో లాబీయింగ్ చేసి కాంట్రాక్టు తెచ్చుకున్నాడని మండిపడ్డారు. ఇవాళ మహేశ్వర్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర మంత్రులకు పరిపాలన కంటే సీఎం కుర్చీపైనే వ్యామోహం ఎక్కువగా ఉంది. రాఘవ కన్​స్ట్రక్షన్​కంపెనీకి వేలాది  కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నరు. దీని వల్ల రాష్ట్ర అధికారులు మంత్రి పొంగులేటికి లొంగిపోయే ప్రమాదం ఉన్నది. ఆయనకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్​చేశారు.