ఉద్ధవ్‌ ఠాక్రే పై కేసు నమోదు

ఉద్ధవ్‌ ఠాక్రే పై కేసు నమోదు

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.  ఠాక్రే కరోనా నిబంధనలు అతిక్రమించారంటూ అ రాష్ట్ర బీజేపీ నేత తేజిందర్‌ పాల్‌ సింగ్ బగ్గా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం కరోనా బారిన పడినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం  వెల్లడించింది. అయితే రాష్ట్రంలో అస్తిరత ఏర్పడిన నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అధికార నివాసం ఖాళీ చేసి  తన సొంతిళ్లైన మాతోశ్రీకి వెళ్లారు. ఈ క్రమంలో  ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులను కలిశారు. కారులో వెళ్తూ వారికి అభివాదం చేశారు.  కరోనా బారిన పడిన సీఎం ప్రొటోకాల్‌ ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలి కానీ, ఇలా అందరినీ కలవడం ఏంటని,  సీఎం కరోనా నిబంధనలు ఉల్లంఘించారని  బగ్గా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లెయింట్‌ కాపీని  బగ్గా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.