బండి సంజయ్ పై తప్పుడు కేసులు..హైకోర్టుకెళ్తాం

బండి సంజయ్ పై తప్పుడు కేసులు..హైకోర్టుకెళ్తాం

పోలీసులు తప్పుడు కేసులు పెట్టి బండి సంజయ్ కు బెయిల్ రాకుండా చేశారన్నారు బీజేపీ అడ్వకేట్ కటకం మృత్యుంజయం. ఎవరిపై దాడి చేశారనే విషయం రిమాండ్ రిపోర్టులో  లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారని 333 సెక్షన్ కింద తప్పుడు కేసు పెట్టారన్నారు. బండి సంజయ్ బెయిల్ కోసం రేపు హై కోర్టును  ఆశ్రయిస్తామన్నారు. జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురిని మాత్రమే కోర్టులు హాజరుపరిచిన పోలీసులు మిగతా వారు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. బండి సంజయ్ కు బెయిల్ నిరాకరించిన కరీంనగర్ కోర్టు.. 14 రోజుల జ్యుడిషియల్  రిమాండ్ విధించింది కోర్టు.

బండి సంజయ్కు బెయిల్ నిరాకరించిన కోర్టు

బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్