బీఆర్ఎస్ పాపాల్లో.. బీజేపీ పాత్ర: మంత్రి ఉత్తమ్

బీఆర్ఎస్ పాపాల్లో..  బీజేపీ పాత్ర: మంత్రి ఉత్తమ్
  • బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అలయ్ బలయ్ లేకపోతే లక్ష కోట్ల రుణం ఎలా వచ్చింది?

  •  ఎల్ అండ్ టీకి 400 కోట్లు ఆపాం

  •  విజిలెన్స్ రిపోర్ట్ అందింది

  •  బాధ్యులపై క్రిమినల్ చర్యలుంటాయ్

  •  ఆ లోన్లన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలె

  • ఎన్డీఎస్ఏ విచారణను స్వాగతిస్తున్నం

  •  ఇరిగేష్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్  రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన సచివాయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. రెండు పార్టీల మధ్య అలాయ్ బలయ్ ఉందని, అందుకే రూ. లక్ష కోట్ల రుణం వచ్చిందని అన్నారు. మేడిగడ్డ నిర్మాణలోపం ఉన్నందున ఎల్అండ్ టీ కంపెనీకి చెల్లించాల్సిన రూ. 400 కోట్ల బిల్లులను ఆపామని చెప్పారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక అందిందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగిన నష్టానికి ఇరిగేషన్ లో ఉన్న లోన్లన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలన్నారు. మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేవని అసత్య ప్రచారం చేశారని, అక్కడ 160 టీఎంసీల నీళ్లున్నట్టు సీడబ్ల్యూసీ చెప్పిందని అన్నారు. 

ఏం పీకవోతరు అన్నరు కదా...

మేడిగడ్డ.. ఓ బొందల గడ్డ.. ఏం పీక పోతరు అన్నోళ్లు ఇప్పుడు ఎందుకు వెళ్లారని ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ లీడర్లు కమీషన్లకు కక్కుర్తి పడి తెలంగాణ రైతుల భవిష్యత్ ను పణంగా పెట్టారని అన్నారు.   మేడిగడ్డ విచారణ కోసం ఎన్టీఎస్ఏ కమిటీ వెయ్యడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎన్డీఎస్ఏ ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాను రేపు ఢిల్లీ వెళ్తున్నానని, మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానని ఉత్తమ్ చెప్పారు. నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తదనే కుట్రతోనే కేసీఆర్ రీ డిజైన్ చేశారని చెప్పారు.

ALSO READ :- పోటీ పరీక్షలకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ : డిప్యూటీ సీఎం భట్టి