రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి పల్లె గోస – బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు చేపట్టనుంది. కార్యక్రమంలో భాగంగా తొలివిడతలో 14 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. బీజేపీ పల్లె గోస - బీజేపీ భరోసా కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గాల ఇంఛార్జును ప్రకటించింది.
నియోజకవర్గ ఇంఛార్జుల వివరాలు
జుక్కల్ – వివేక్ వెంకటస్వామి, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు -
దేవరకద్ర – ఈటల రాజేందర్, ఎమ్మెల్యే
ఆదిలాబాద్ – ధర్మపురి అరవింద్, ఎంపీ
మంచిర్యాల – సోయం బాబు రావు, ఎంపీ
వేములవాడ – ఎండల లక్ష్మి నారాయణ, మాజీ ఎమ్మెల్యే
బోధన్ – రాజాసింగ్, ఎమ్మెల్యే
సిద్దిపేట – మురళీధర్ రావు, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్
తాండూరు – డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
మేడ్చల్ – జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ
షాద్ నగర్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ
కల్వకుర్తి – బాబు మోహన్, మాజీ మంత్రి
నర్సంపేట – రఘునందన్ రావు,ఎమ్మెల్యే
వనపర్తి – డా. లక్ష్మణ్, ఎంపీ
కొత్తగూడెం – గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ
