మా పొత్తు జనసేనతోనే.. టీడీపీపై నిర్ణయం తీసుకోలేదు : పురంధేశ్వరి

మా పొత్తు జనసేనతోనే.. టీడీపీపై నిర్ణయం తీసుకోలేదు : పురంధేశ్వరి

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు  ప్రతిపక్ష పార్టీలు   టీడీపీ, జనసేన  కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.  టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే  ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? లేదా అన్నది చంద్రబాబు కానీ..పవన్ కళ్యాన్ గానీ  ఎక్కడా చెప్పలేదు. బీజేపీ అధిష్టానం కూడా ఎక్కడా పొత్తులపై  నోరు విప్పలేదు. ఓటు బ్యాంకు చీల్చకుండా మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీనిపై ఇంత వరకు బీజేపీ జాతీయ నేతలు  కూడా ఎక్కడా స్పందించలేదు.

అయితే లేటెస్ట్ గా ఏపీలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. ఏపీలో తాము ఇప్పటికీ జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పారు. అయితే టీడీపీతో పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది.  బీజీపీతో పొత్తులపై, సీట్ల పంపకాలపై క్లారిటీ  తీసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవనున్నారని తెలుస్తోంది.