- బాపూ ఘాట్ వద్ద కాంగ్రెస్ నేతల మౌన దీక్ష
మెహిదీపట్నం, వెలుగు : దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి, బీహార్ ఎంపీ తారీక్ అన్వర్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును కేంద్రం తొలగించడమే దీనికి నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ పేరును తొలిగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం లంగర్ హౌస్ బాపూ ఘాట్‌లోని గాంధీజీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అన్వర్ హాజరై మాట్లాడుతూ దేశంలో కూలీలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో నాడు కాంగ్రెస్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఆ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును నేడు ఎన్డీఏ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. పథకానికి మళ్లీ మహాత్మాగాంధీ పేరు పెట్టేవరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. మోతే రోహిత్, ఉషశ్రీ, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
