బూత్‌ దగ్గరే టీఆర్ఎస్ డబ్బు పంపకం: అడ్డుకున్న బీజేపీ అభ్యర్థి అరెస్ట్

బూత్‌ దగ్గరే టీఆర్ఎస్ డబ్బు పంపకం: అడ్డుకున్న బీజేపీ అభ్యర్థి అరెస్ట్

నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌లో టీఆర్ఎస్ నేతలు మద్యం, డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఉదయం నుంచి టీఆర్ఎస్ నేతలు డివిజన్ పరిధిలోని అన్ని బూత్‌లలో తిరుగుతూ డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని బీజేపీ కార్యకర్తలను బెదరగొట్టారు. బీజేపీ అభ్యర్థి వినోద్‌ను అరెస్ట్ చేసి మాక్లూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.

పోలీసుల తీరుపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం

డబ్బు, మద్యం పంపిణీ చేసిన అధికార పార్టీ కార్యకర్తలు, లీడర్లను వదిలేసి.. అడ్డుకున్న బీజేపీ అభ్యర్థిని అరెస్టు చేయడంపై పలువురు నేతలు మండిపడుతున్నారు. స్పాట్‌కు చేరుకున్న స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ పోలీసులను నిలదీశారు. తమ అభ్యర్థి ఏం చేస్తే అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మర్డర్ ఏమైనా చేశాడా అంటూ మండిపడ్డారు. లీగల్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఏం చేస్తారో చేయండని చెప్పారు ఎంపీ అర్వింద్. ఎన్నికల నిర్వహణలో సర్కారు పెద్దల తీరు జరిగాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.