
దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి సంబంధం లేదన్నారు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత నాలుగు రోజులుగా టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందన్నారు. శామీర్‌పేటలో రెండు కార్లలో నలుగురు వ్యక్తులు, రూ.40 లక్షలు తీసుకెళ్తున్నారని పోలీసులు చెప్పారని , ఆ నలుగురిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నారు.
టీఆర్ఎస్ నేతలు.. ప్రచారం లో తనను అనేక ఇబ్బందులు పెట్టారని… తప్పుడు కేసులు పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారన్నారు. తమ బంధువులు ఇంట్లో డబ్బులు దొరకలేదని, వారి పక్క ఇంట్లో దొరికిన డబ్బులను తమపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. తన తల్లిదండ్రులను కూడా ఉప ఎన్నికల్లో ప్రస్తావించారని.. అనేక రకాలుగా తనపై కుట్రలు చేశారన్నారు.
మంత్రి హరీష్ రావు.. తనపై వ్యక్తి గత దూషణలకు పాల్పడాడని.. సర్పంచ్ లకు బీజేపీ వోడు అంటూ కించపరిచేలా మాట్లాడాడని, వాడు వీడు అంటూ మాటలు అన్నాడన్నారు.