నిరుద్యోగ భృతి కింద వెంటనే రూ. లక్ష ఇవ్వాలి

V6 Velugu Posted on Sep 15, 2021

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు. 

‘రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భృతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రచారం చేసిన కేసీఆర్.. తన కుటుంబం, వారి బంధువులకు డజను ఉద్యోగాలిచ్చారు. నిరుద్యోగ భృతి కింద విద్యావంతులైన యువతీ, యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయలు బకాయి పడింది. ఆ లక్ష రూపాయలను నిరుద్యోగ యువతీయువకులు వెంటనే అందించాలి’ అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tagged Bjp, TRS, Bandi Sanjay, Telangana, students, unemployment, CM KCR, unemployment benefit

Latest Videos

Subscribe Now

More News