కరోనా వైరస్ కారణంగా మరో 15 రోజులు కొనసాగే లాక్ డౌన్లో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరు కమిటీలను నియమించారు. ప్రజాప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర నాయకులకు కమిటీల్లో స్థానం కల్పించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి, వివిధ స్థాయిల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయి, వాటి పరిష్కారానికి కృషి చేసేలా ఈ కమిటీలను నియమించినట్టు పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి కమిటీల వివరాలను వెల్లడించారు.
1.లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ కమిటీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి.
2.హెల్త్ ఇష్యూస్ మానిటరింగ్ కమిటీ: మాజీ ఎమ్మెల్యే టి. రాజేశ్వర్రావు, మాజీ మంత్రి విజయరామారావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ రాజ్ యాదవ్, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ విజయచంద్రారెడ్డి, వెంకట్రావు, బీఎస్ఎన్మూర్తి, బీజేపీ డాక్టర్స్ సెల్ లీడర్ సురేందర్.
3.రిసోర్సెస్ ఫర్ గ్రోసరీస్ ప్రొక్యూర్మెంట్ కమిటీ: రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి, జాతీయ నాయకులు శేఖర్రావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మినారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మనోహర్రెడ్డి.
4.గ్రేట్ పీపుల్స్ఇష్యూస్ మానిటరింగ్ కమిటీ: మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, సిటీ జనరల్ సెక్రెటరీ అట్లూరి రామకృష్ణ, టి. ఉమమహేంద్ర, రాజేశ్, బీజేపీ లింగ్విస్టిక్ మైనారిటీ కమిటీ చైర్మన్ భవర్లాల్ వర్మ.
5.మాస్క్స్అరెంజ్మెంట్స్ కమిటీ: మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు చాయాదేవి, నిర్మలాదేవి గోనెల, మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ యమునా పథక్, మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీ సరళా, స్వచ్ఛభారత్ ప్రచార కన్వీనర్ జయశ్రీ, బేటీ బచావో బేటీ పడావో కమిటీ చైర్ పర్సన్ జి.విజయలక్ష్మి, బీజేపీ స్టేట్ ఈసీ మెంబర్ పదురి కరుణ, పద్మ వీరపునేని.
6.అగ్రికల్చర్ ఇష్యూస్ మానిటరింగ్ కమిటీ: బీజేపీ జాతీయ నేత ఇంద్రసేనారెడ్డి, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కే. వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు , మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, బీజేకేఎం నేషనల్ జనరల్ సెక్రెటరీ సుగుణాకర్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి.

