ఒక్క ఇంటర్వ్యూతో సీ-డాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. రూ.17 లక్షల వరకు వార్షిక వేతనం

 ఒక్క ఇంటర్వ్యూతో  సీ-డాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు..  రూ.17 లక్షల వరకు వార్షిక వేతనం

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్​డ్ కంప్యూటింగ్ (సి–డాక్) ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజిర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్​ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

పోస్టు పేరు: ప్రాజెక్ట్  ఇంజినీర్/ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్.
మొత్తం ఖాళీలు: 15. 
విభాగాల వారీగా ఖాళీలు:  ప్రాజెక్ట్  ఇంజినీర్ 5, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ 10.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: మే 23 నుంచి 30  వరకు .
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ను www.cdac.in సందర్శించండి.

ALSO READ : మెడికల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: MIDHANIలో జాబ్స్..

ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ లకు  వార్షిక వేతనం  రూ.10 లక్షలు

సీనియర్ ప్రాజెక్టు ఇంజినీరింగ్ కల రూ 30 వేలు