ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ మృతి.. 38 ఏళ్లకే ప్రాణం పోయింది !

ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ మృతి.. 38 ఏళ్లకే ప్రాణం పోయింది !

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత, దివంగత ములాయం సింగ్ యాదవ్ కొడుకు ప్రతీక్ యాదవ్ బుధవారం చనిపోయాడు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. ఆయనను లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉత్తర ప్రదేశ్లో రాజకీయంగా యాక్టివ్గా ఉండే ఫ్యామిలీస్ లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబం ఒకటి. ఇలా.. ప్రతీక్ మరణ వార్త యూపీ రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు  ప్రతీక్ యాదవ్ సవతి సోదరుడు. తన సోదరుడు అఖిలేష్లా కాకుండా.. ప్రతీక్ యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉండేవాడు. ప్రతీక్ వ్యాపార రంగంలో యాక్టివ్గా ఉన్నాడు. ప్రతీక్ యాదవ్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఆయనకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్, ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రతీక్, అపర్ణలకు ఒక కూతురు కూడా ఉంది. ప్రతీక్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది.

పోస్ట్‌మార్టం నివేదిక విడుదలైన తర్వాతే.. ఆయన చనిపోవడానికి అసలు కారణం తెలుస్తుంది. ఉదయం 6 గంటల సమయానికే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన చనిపోయారు. ప్రతీక్ యాదవ్, అపర్ణ మధ్య ఇటీవల మనస్పర్థలు రావడంతో వైవాహిక బంధానికి బీటలు వారాయి. దివంగత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడే ఈ ప్రతీక్ యాదవ్. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సవతి సోదరుడు అయిన ప్రతీక్ యాదవ్ బుధవారం లక్నోలో చనిపోయాడు.

ప్రతీక్ యాదవ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని వారాల క్రితం.. ఆయనను లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో చేర్చారు. అఖిలేష్ యాదవ్ కూడా ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో.. ఇంటికి తీసుకువెళ్లారు. ఇంతలోనే.. ఆయన చనిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.