త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం

త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: బీజేపోళ్లు, కాంగ్రెసోళ్లు పాలించే రాష్ట్రాల్లో కనీసం కరెంటు కూడా లేదన్నారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాదని..అబద్ధాలకు అడ్డా అని విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి హరీశ్ రావు..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 102 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభం చేసుకున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధికంగా పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారు.. ఇది మంచి పరిణామం కాదు. అనేక అనర్థాలు జరుగుతున్నాయని మంత్రి హెచ్చరించారు. సిజరియన్ డెలివరీలు అవసరం మేరకే చేయాలి తప్ప అనవసరంగా చేయవద్దని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం మంచిదని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రచార చేయాలన్నారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగాలని మంత్రి సూచించారు. 
 సీఎం కేసీఆర్ మీకు మరో వరం ఇచ్చారని, త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. 8 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ పంపిణీ పథకం అమలు చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. 200 పడకల ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని రకాల మందులు రోగులకు అందుబాటులో ఉంచడం కేసీఆర్ లక్ష్యం అన్నారు. తెలంగాణలో ఇంత అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని, బీజేపీ నేతలు జూటా మాటలు మాట్లాడుతున్నారని, 75 ఎండ్ల లో మూడు మెడికల్ కాలేజీ లు ఉంటే కేసీఆర్ పాలనలో 33 మెడికల్ కాలేజీ లు తీసుకువచ్చారన్నారు.  

నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితులుండేవి

తెలంగాణ రాకముందు..నీళ్లకోసం కొట్లాడే పరిస్థితులు ఉండేవన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో సాగు నీటి సమస్య తీరిందన్నారు.  భూపాలపల్లి జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గతంలో ఏ ప్రభుత్వం గిరిజన తండాల గురించి పట్టించుకోలేదన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

పోలీసులపై చిరుత దాడి

ఇడ్లీ అమ్మకు ఇల్లు కట్టించిన టెక్ మహీంద్రా

ఉపాధి పనులకు బొట్టుపెట్టి పిలుస్తున్నరు