రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ‘రాజ్యాంగ రక్షణ దీక్ష’

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ‘రాజ్యాంగ రక్షణ దీక్ష’

అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై  బీజేపీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా ‘రాజ్యాంగ రక్షణ దీక్ష’ను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరింది.  ఈ నిరసన కార్యక్రమాలలో బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది.