ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..!

ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..!

లోక్​సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​పైనే ఫోకస్ పెట్టాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు షురూ చేశాయి. 

అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్ లోక్​సభ స్థానంలో మజ్లిస్​కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. ఎంఐఎంపై విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. అనూహ్యంగా విరించి హాస్పిటల్స్ చైర్​పర్సన్ మాధవీలతకు చాన్స్ ఇచ్చింది. సోషల్ యాక్టివిటీస్‌‌‌‌, యజ్ఞాలు నిర్వహణ, గోశాల ఏర్పాటు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మాధవీలత సోషల్‌‌‌‌ మీడియాలో యాక్టివ్‌‌‌‌గా ఉన్నారు. ఆమె చేసిన కొన్ని ప్రసంగాలు బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. దీంతో ఆమెను అసదుద్దీన్ ఒవైసీపై నిలబెట్టాలని భావించి టికెట్ కేటాయించింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆమెకు టికెట్ ఇచ్చి.. బీజేపీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి యాదవ అభ్యర్థి

హైదరాబాద్‌‌‌‌ లోక్‌‌‌‌సభ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దించింది. పాతబస్తీలో యాదవ సామాజికవర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీ మాజీ గ్రంథాలయ చైర్మన్‌‌‌‌ గడ్డం శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌కు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. సామాజికవర్గంతో పాటు వ్యక్తిగతంగా ఓల్డ్‌‌‌‌ సిటీలో శ్రీనివాస్ యాదవ్​కు మంచి పట్టున్నట్టు సమాచారం. దీంతో ఎక్కువ ఓట్లు సాధించే ప్రయత్నం చేస్తున్నది.