తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం అభినందనీయం

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం అభినందనీయం

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్ ఈటీవీ విన్ కూడా సత్తా చాటింది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఏకంగా ఏడు కేటగిరీల్లో  అవార్డుల్ని  సొంతం చేసుకున్నాయి.  బెస్ట్ ఫిలింగా ‘రాజు వెడ్స్ రాంబాయ్’,  బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్‌‌‌‌గా  ‘అనగనగా’, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌‌‌‌గా  ‘మౌనమే నీ భాష’,  బెస్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా  సాయిలు కంపాటి (రాజు వెడ్స్ రాంబాయి),  బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా -సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్),  బెస్ట్ మేల్ యాక్టర్ జ్యూరీగా చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్  రాంబాయి),  ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరీలో  అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్  రాంబాయి)కు అవార్డులు దక్కాయి.

 ఈ సందర్భంగా ఈటీవీ విన్ మేకర్స్ విజేతలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు  అతిథులుగా హాజరైన దర్శక నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్ నారాయణ మూర్తి అవార్డ్స్ విజేతలను, ఈటీవీ విన్  యాజమాన్యాన్ని అభినందించారు. ఇదొక మంచి ప్రోత్సాహంగా భావిస్తున్నామని  విజేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు  వేణు ఊడుగుల,  సాయిలు కంపాటి, సాయి మార్తాండ్,  ఆదిత్య హాసన్,  అనురాగ్ కులకర్ణి,  సురేష్ బొబ్బిలి,  ప్రొడ్యూసర్ రాహుల్ తదితరులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.