ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టాలి : బీజేపీ

ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టాలి : బీజేపీ

ఉప్పల్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. పార్టీ ఉప్పల్​డివిజన్​ ప్రెసిడెంట్​ఫణీంద్ర ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. యూనిఫామ్స్, బుక్స్, డొనేషన్ల పేరుతో ప్రైవేట్​విద్యాసంస్థల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. విద్యాశాఖను తన ఆధీనంలోనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా స్పందించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతోపాటు ప్రైవేట్​స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టాలన్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్​శిల్పా రెడ్డి, గిరిజన మోర్చా ప్రెసిడెంట్​నేనావత్ రవి నాయక్, నాయకులు పాల్గొన్నారు.