ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలి : రఘునాథ్ వెరబెల్లి

ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలి : రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు ఎండిన రైతులకు ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శుక్రవారం సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ అంటేనే 420 పార్టీ అని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

రూ.2లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15వేల రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ వంటి అబద్ధపు హామీలను ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.

రైతులకు యూరియా కష్టాలు రావద్దని రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునర్ నిర్మించారని అన్నారు. . బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, నాయకులు రజనీష్ జైన్, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యల ఏమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పురుషోత్తం జాజు, మున్నారాజ్ సిసోడియా, మోటపలుకుల గురువయ్య పాల్గొన్నారు.