జైళ్లో పెట్టే సరికి.. కవిత బీజేపీ గానం.. బీసీ నినాదం బీజేపీకి ఫేవర్ చేసేందుకే: కేఏ పాల్

జైళ్లో పెట్టే సరికి.. కవిత బీజేపీ గానం.. బీసీ నినాదం బీజేపీకి ఫేవర్ చేసేందుకే: కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైల్లో పెట్టే సరికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ గానం చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. కేసీఆర్  లేదా బీఆర్ఎస్  కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ఆయన అన్నారు. మంగళవారం (జులై 09) ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కవితను రంగంలోకి దించారని, బీసీ నినాదంతో కవితను బీజేపీ తీసుకువచ్చిందని విమర్శించారు. 

ఓబీసీ పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించిందని ఆయన ప్రశ్నించారు. అవకాశం ఉన్నా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ కు ఆ పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బ్రాహ్మణులకు తాను వ్యతిరేకం కాదని.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బీసీలను కాదని, బ్రాహ్మణుడైన రాంచందర్ రావుకు ఎందుకు చాన్స్ ఇచ్చారో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకుంటే జూబ్లీహిల్స్ లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.