Hyderabad: కరాచీ బేకరీలపై బీజేపీ కార్యకర్తల దాడులు.. పేరు మార్చుకోవాలంటూ విధ్వంసం..

Hyderabad: కరాచీ బేకరీలపై బీజేపీ కార్యకర్తల దాడులు.. పేరు మార్చుకోవాలంటూ విధ్వంసం..

Karachi Bakery: కేవలం హైదరాబాదులో మాత్రమే కాకుండా దేశంలోని అనేక నగరాల్లో కరాచీ బేకరీ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన ఒక ఫ్యామిలీ దీనిని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే పక్కన పాకిస్థానుతో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో దాయాది దేశంలోని ఒక నగరం పేరును కలిగి ఉండటంపై దుమారం కొనసాగుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే కరాచీ బేకరీని 1953లో సింధీ వ్యాపారవేత్త ఖాన్ చంద్ రమ్నాని స్థాపించిన సంగతి తెలిసిందే. తాము 100 శాతం ఇండియాలో పుట్టి సంస్థగా కరాచీ బేకరీ యాజమాన్యం చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం సదరు వ్యాపార సంస్థపై దాడులను మాత్రం ఆపటం లేదు. దాదాపు 70 ఏళ్ల నుంచి కరాచీ పేరుతో కొనసాగిస్తున్న వ్యాపార పేరును మార్చుకోవాలంటూ శనివారం దాదాపు 10 మంది బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ క్రమంలో నగరంలోని వారికి చెందిన ఒక బేకరీ నేమ్ బోర్డును ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు.

దీనికి తోడు హైదరాబాదుతో పాటు విశాఖలోని కరాచీ బేకరీ షాపుల ఎదుట నిరసనకారులు బిజినెస్ పేరు మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. శత్రుదేశంలోని ఒక నగరం పేరును కొనసాగించటాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు శంషాబాద్ ప్రాంతంలోని ఒక కరాచీ బేకరీపై దాడి చేస్తూ పాకిస్థాన్ మర్థాబాద్, భారత్ మాతా జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దాడికి యత్నించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఈ క్రమంలో నిరసన కారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు బేకరీ పేరు ఉన్న బోర్డును ధ్వంసం చేస్తున్న విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు సేఫ్ గా ఉన్నారని, పెద్దగా ఆస్తినష్టం కూడా జరగలేదని పోలీసులు చెప్పారు. సకాలంలో అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్లు వారు వెల్లడించారు. మరోపక్క బేకరీ యజమానులు ఇది తమ తాతాల కాలం నుంచి వస్తున్న వ్యాపారమని, తమకు అండగా నిలబడాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా పేరు మార్పు విషయంలో తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.