బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే తెలుసు

బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే తెలుసు

మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనుకున్నంత వేగంగా లేదన్న వార్తలతో రాహుల్ గాంధీ శనివారం ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే కానీ కొత్తగా దేనినీ నిర్మించే సత్తా లేదని ఆరోపించారు. ‘‘బీజేపీ ప్రభుత్వం దేనినీ నిర్మించలేదు. దశాబ్దాల తపన, విశేష కృషితో నిర్మించిన కట్టడాలను కూల్చడం మాత్రమే చేయగలదు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.