ప్రతిపక్షాలపై బీజేపీ సర్కారు నిర్బంధం

ప్రతిపక్షాలపై బీజేపీ సర్కారు నిర్బంధం
  •     కేంద్ర ప్రభుత్వంపై లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీల ఆగ్రహం 

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ, ప్రజా హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.బాలమల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వీరయ్య విమర్శించారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆర్టీసీ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. శుక్రవారం ఎంబీ భవన్ సీపీఎం స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ అధ్యక్షతన లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీల సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐలను బీజేపీ తమ జేబు సంస్థలుగా వాడుకుంటున్నదని మండిపడ్డారు.