టీఆర్ఎస్ బూటకపు పాలనపై చార్జిషీట్ విడుదల చేసిన బీజేపీ

టీఆర్ఎస్ బూటకపు పాలనపై చార్జిషీట్ విడుదల చేసిన బీజేపీ

సిద్దిపేట: టీఆర్ఎస్ బూటకపు పాలనపై చార్జిషీట్ విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చార్జిషీట్ విడుదల చేసిన ఆయన రాష్ట్రంలో పాలన తీరుపై విరుచుకుపడ్డారు.  2013 ,2014 ఎన్నికల సమయంలో సైకిల్ మీద తిరిగే వాళ్లు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారని, కోమటి చెరువు అభివృద్ధి పేరుతో పేదల డబ్బులను వృధా చేశారని ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేటకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీలా మారిందని.. 12 వేల మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు పెట్టుకుంటే కేవలం రెండు వేల మందికి మాత్రమే ఇవ్వడం జరిగిందని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా మరుగుదొడ్లను కట్టించారని చెప్పారు. మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని రాత్రికి రాత్రి రోడ్లను నిర్మించారని, అమృత్ పథకం కింద నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 2023లో కేసీఆర్ ను ఇంటికి పంపి, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.