రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఎంపీలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఎంపీలు
  • రాజస్థాన్​ లో 41 మందితో బీజేపీ తొలి జాబితా రిలీజ్​

  • ఎంపీలో 57, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 64 మంది ఖరారు

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజస్థాన్​లో బీజేపీ 41 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా రిలీజ్​ చేసింది. అందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లు ఇచ్చింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు స్థానం దక్కలేదు. ఈ నెల ఒకటో తేదీన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) సమావేశంలో వీరి పేర్లను ఖరారు చేశారు. 

ఈ సమావేశంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సైతం 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్​కు మళ్లీ బుధ్నీ సెగ్మెంట్​నే కేటాయించింది. చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ 64 మంది అభ్యర్థులతో బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.