జడ్పీటీసీ బరిలోకి ఎమ్మెల్యే అభ్యర్థులు!

జడ్పీటీసీ బరిలోకి ఎమ్మెల్యే అభ్యర్థులు!
  • టికెట్ ఆశించినోళ్లనూ పోటీకి దింపాలని బీజేపీ యోచన  
  • బలమైన నేతలను రంగంలోకి దింపేందుకు అధిష్టానం కసరత్తు 
  • ఆసక్తి ఉన్నవారివివరాలు సేకరిస్తున్న నేతలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, కాంగ్రెస్​కు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలని భావిస్తోంది. దీనికోసం బలమైన నేతలను బరిలోకి దింపాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. గత లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ నామమాత్రపు సీట్లను గెలుచుకున్నది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8  స్థానాల్లో విజయం సాధించగా, లోక్​సభ ఎన్నికల్లోనూ 8 సీట్లను కైవసం చేసుకున్నది. ఇటీవల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలనూ గెలుచుకున్నది. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కస్థానంలోనూ గెలవలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటితే బీఆర్ఎస్ కంటే తామే కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. 

బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు

స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవారు, ఎమ్మెల్యే టికెట్ ఆశించినవారు, పార్టీలోని ముఖ్య నేతలను జెడ్పీటీసీలుగా పోటీ చేయించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి రిజర్వేషన్లకు తగ్గట్టుగా నేతల కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొందరు కీలక నేతలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సంకేతాలు ఇచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలుండగా, మూడో వంతు సీట్లైనా గెలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 

ఒకవేళ జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయితే, భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ లభించదేమోనన్న భయం అవసరం లేదని నేతలకు పార్టీ నాయకత్వం హామీ ఇస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి వారికి పార్టీ ఎంపీ టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఇక్కడ కూడా అదే ఫార్ములా వర్తిస్తుందని భరోసా ఇస్తోంది.   

ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే గెలుపు బాధ్యత  

పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను గెలిపించుకోవాలని వ్యూహరచన చేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను పార్టీ వారికే అప్పగించింది. లోకల్ బాడీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే రాష్ట్ర స్థాయి వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించింది. జిల్లా స్థాయి వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా పూర్తయ్యాయి. స్థానిక ఎన్నికలకు సమన్వయం కోసం జిల్లాల వారీగా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కూడా పార్టీ నియమిస్తోంది. మండల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మండల కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కూడా నియమించనున్నారు. అయితే, ఈ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్థానిక ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా, పార్టీ నేతలను సమన్వయం చేసే బాధ్యతలు నిర్వహించనున్నారు.