
సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగుచెంది మార్పు కోరుకుంటున్నారని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. తాము గెలవకపోయినా పర్వాలేదు..బీజేపీ మాత్రం గెలవకూడదనే విధంగా టీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీనేనని అన్నారు. పట్టభద్రులు ఆలోచించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాల్లోనూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మంత్రి కిషన్ రెడ్డి.