వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం

మునుగోడు ఉప ఎన్నిక ప్రీ ఫైనల్ ఎన్నిక లాంటిదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి  అన్నారు. ఎస్సీ మోర్చ సమావేశంలో మాట్లాడిన వివేక్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని తెలిపారు. అందరూ కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణలోని ప్రతి బీజేపీ కార్యకర్తకు స్పూర్తిదాయకమని వివేక్ వెంకటస్వామి తెలిపారు. 

రెండు నెలల్లోగా మునుగోడు బై పోల్ పోలింగ్ జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబరులోగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పోల్స్ జరగనున్నాయి. ఆ సమయంలోనే మునుగోడు ఉప ఎన్నిక కూడా నిర్వహించే చాన్స్ ఉందని అంటున్నారు.

సాధారణ ఎన్నికలకు మరో 14 నెలల సమయమే ఉంది. సాధారణ ఎన్నికలు సమీపించిన ఈ కీలక సమయంలో జరగబోతున్న మునుగోడు బై పోల్ ను బీజేపీ సెమీ ఫైనల్ గా భావిస్తోంది. హుజూరాబాద్ తరహాలోనే.. మునుగోడు బై పోల్ లోనూ గెలవాలనే కృత నిశ్చయంతో కమలదళం ఉంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు పోయేందుకు సమాయత్తం అవుతోంది.