దత్తన్న సీటు కిషన్ రెడ్డికి

దత్తన్న సీటు కిషన్ రెడ్డికి

రాష్ట్రంలో పది మంది ఎంపీ అభ్యర్థు లతో బీజేపీ జాబితా విడుదలైంది. సికిం ద్రాబాద్ సిట్టిం గ్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థా నంలో ఆ సీటును బీజేపీ రాష్ ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి కేటాయించింది. ఇటీవల కాం గ్రెస్ నుంచి పార్టీలో చేరిన డీకే అరుణకు మహబూబ్ నగర్ టికెట్ ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా 184 అభ్యర్థు లతో బీజేపీ గురువారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో రాష్ట్రం నుంచి 10 సీట్లు ఉన్నాయి. బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఏకైక సిట్టింగ్‌‌ స్థానం సికింద్రాబాద్‌‌. ఇప్పటి వరకు ఇక్కడ దత్తాత్రేయ ఎంపీగా ఉన్నారు. సికింద్రాబాద్‌‌ టికెట్‌‌ విషయంలో పార్టీ నేతలు డాక్టర్‌‌ లక్ష్మణ్‌‌, దత్తాత్రేయ, కిషన్‌‌రెడ్డి పోటీ పడగా.. చివరికి కిషన్ రెడ్డికి అవకాశం దక్కింది. మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఎమ్మెల్సీ రాం చందర్‌‌రావును ఖరారు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బండి సంజయ్‌ కు ఈ దఫా కరీం నగర్‌‌ ఎంపీ సీటు దక్కింది. మొదటి నుంచి నిజామాబాద్ లోక్ సభ స్థానంపై గురిపెట్టిన ధర్మపురి అరవింద్‌‌కు అదే సీటు ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో పది సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మరో ఏడు సీట్లను పెండింగ్ లో పెట్టింది.