కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది: లక్ష్మణ్

కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది: లక్ష్మణ్

సీఎం కేసీఆర్ పాలనపై రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందని అన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులను ఉద్ధరిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని చెప్పారు. HRD రిపోర్టు ప్రకారం తెలంగాణ  అభివృద్ధిలో వెనకపడిపోయిందని అన్నారు.  ఇప్పటికీ రాష్ట్రంలో వెయ్యి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని అన్నారు లక్ష్మణ్. ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను కనీసం పలకరించని కేసీఆర్ ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్లారని విమర్శించారు.  విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు.

కేంద్రంలో మళ్లీ NDA..
కేంద్రంలో మళ్లీ NDA ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. మే 23తర్వాత కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని చెప్పారు. మోడీ ప్రభుత్వంలో నిత్వవసర ధరలు తగ్గాయని అన్నారు. ఉగ్రవాదం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు.

ప్రాంతీయ పార్టీలు కులతత్వాన్ని నూరిపోయటానికే పరిమితమయ్యాయని అన్నారు లక్ష్మణ్. కుటుంబ పాలనలో అభివృద్ధి జరగదని చెప్పారు. పోరాటాల ద్వారా టీఆర్ఎస్ ను ఎదుర్కొంటామని అన్నారు. వారణాసిలో నామినేషన్ వేసిన వారందరూ టీఆర్ఎస్ ఏజెంట్లని చెప్పారు.