జన ఆశీర్వాద యాత్ర.. బీజేపీ టార్గెట్ 10 వేల కిలోమీటర్లు

జన ఆశీర్వాద యాత్ర.. బీజేపీ టార్గెట్ 10 వేల కిలోమీటర్లు

మధ్య ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ.. గెలుపే లక్ష్యంగా బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.2024 జనవరిలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అసెం బ్లీ పదవీ కాలం ముగుస్తుండటంతో  ఆశీర్వాదం కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమతున్నారు బీజేపీ నేతలు. అందుకోసం సభలు, సమావేశాలు, యాత్రలను చేపడుతున్నారు. రాష్ట్రంలో ఐదు జన్ ఆశీర్వాద్ యాత్ర లను నిర్వహించేందుకు డేట్స్ ఫిక్స్ చేశారు. మొత్తం ఈ యాత్రను 10వేల 543 కిలోమీటర్లు నిర్వహించాలని టార్గెట్ గా పెట్టుకుంది.  అమిత్ షా ప్రారంభించే యాత్ర జబల్ పూర్ మీదుగా భోపాల్ చేరుకుంటుంది. 

సెప్టెంబర్ 3నుంచి జన ఆశీర్వాద్ యాత్రలను ప్రారంభించనుంది.  మొదటగా సాత్నా జిల్లాలోని చిత్రకూట్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటి జన్ ఆశీర్వాద్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 4న రెండు, మూడవ జన్ ఆశీర్వాద్ యాత్రలు ఖండ్వా, నీముచ్ జిల్లాలో ప్రారంభం కానున్నాయి. వీటికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. సెప్టెంబర్ 5న మండల నుంచి నాల్గవ యాత్ర ప్రారంభం అవుతుంది.  

ఐదవ జన్ ఆశీర్వాద్ యాత్ర సెప్టెంబర్ 6న, షియోపూర్ లోని బరోడా నగర్ నుంచి ప్రారంభమైన రైసెన్ మీదుగా భోపాల్ చేరుకోనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యాత్రను ప్రారంభించనున్నారు. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా 211 బహిరంగ సభలతో సహా మొత్తం 678  సభలను నిర్వహించునున్నారు. ఈ యాత్రలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేబినెట్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా, కైలాష్ విజయ వర్గీయ పాల్గొననున్నారు. 

సెప్టెంబర్ 25న ప్రధాని మోదీ సభ 
రాష్ట్రంలోని మొత్తం ఐదు జన్ ఆశీర్వాద్ యాత్రలు ముగిశాక.. సెప్టెంబర్ 25న భోపాల్ లో ప్రధాని మోదీ సభ నిర్వహించారు. ఈ సభలో దాదాపు పది లక్షల మంది కార్మికులను సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా బీజేపీ నేతలు. ఈ సభలో కార్మికులనుద్దేశించి ప్రధాని సందేశం ఇవ్వనున్నారు. 

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 మంది సభ్యులున్న శాసన సభకు 2023డిసెంబర్ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభ పదవీకాలం 2024 జనవరిలో ముగియనుంది.