కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు

కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు
  • మోడీని తిడుతుంటే ప్రజలు ఊరుకోరు
  • పుత్రవాత్సల్య పార్టీలన్నీ ఆగమైనయ్
  • కొడుకు కోసం సీఎం కేసీఆర్ ఆరాటం తప్ప ఏం లేదు
  • బీజేపీ బలాన్ని చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నడు

హైదరాబాద్: తాను రాజ్యసభకు ఎన్నికైతే సీఎం కేసీఆర్కు ఎందుకు ఈర్శ్య అని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.  అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న లక్ష్మణ్..కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారని.. హైదరాబాద్ డ్రగ్ మాఫియాగా తయారైందని చెప్పారు. తెలంగాణను దోచుకున్నది చాలన్నారు. ప్రధాని మోడీని తిడుతుంటే ప్రజలు ఊరుకోరన్నారు.

పుత్రవాత్సల్య పార్టీలన్నీ పతనమైనయన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని చెప్పారు. అలాంటిది దేశాన్ని మీరు మారుస్తారా అని ప్రశ్నించారు. విజయ సంకల్ప సభకు తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున తరలివస్తే కేసీఆర్ తట్టుకోలేకనే .. సహనం కోల్పోయి మాట్లాడారన్నారు.  ప్రధాని మోడీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. సామాజిక న్యాయం, అందరికీ న్యాయం చేయాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. దళిత ముఖ్యమంత్రిని సీఎం చేస్తానని మాట తప్పలేదా.. అలాంటిది మోడీ చేసి చూపిస్తుంటే మీరు ఓర్వలేక పోతున్నారని తెలిపారు. ఒక ఆదీవాసి బిడ్డకు రాష్ట్రపతి అవకాశం ఇచ్చిన మోడీ ఎక్కడా.. పోడు భూముల గురించి ఆదీవాలుసపై దాడులు చేస్తున్న మీరెక్కడా అని ప్రశ్నించారు.