బీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి

బీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోడీ సభ ఏర్పాట్లు చూసి ముఖ్యమంత్రికి పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను, హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ జనాన్ని నట్టేట ముంచారని డీకే అరుణ ఆరోపించారు. ప్రజల హృదయాల్లో బీజేపీ స్థానం సుస్థిరం అవుతుండటాన్ని చూసి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

రెండుసార్లు కేసీఆర్ ను నమ్మిన రాష్ట్ర ప్రజలు ఈ సారి ఆయనను ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారని డీకే అరుణ అన్నారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబం మాత్రమే బంగారుమయమైందని విమర్శించారు. అన్ని వర్గాల ఆశలు నెరవేరాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్ల పేరు చెప్పి అవినీతి, దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ స్పష్టం చేశారు.