పోలీసులపై నమ్మకం లేదు

పోలీసులపై నమ్మకం లేదు

తమపై బూటకపు కేసులు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. ఇళ్లపై రాళ్లు వేయడం ఏం రాజకీయం అని ప్రశ్నించారమె. పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర గారు టీఆర్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న స్టీఫెన్ రవీంద్ర ఇలా మాట్లాడం సరికాదన్నారు. అప్పుడు పులి కాస్త ఇప్పుడు పిల్లి అయిపోయిందని అరుణ విమర్శించారు. ఈ కేసుల వెనుక సీఎం కేసీఆర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుట్ర ఉందని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్య కుట్ర అనేది పచ్చి అబద్ధం అన్నారు అరుణ.

తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. విచారణకు తాము ఎప్పుడైనా సహకరిస్తా అన్నారు. తమకు ఎలాంటి భయం లేదన్నారు. విచారణకు రమ్మంటే ఆఫీసులకు వస్తే అన్నారు. ఇదంతా వారు చేసిన కుట్రలో భాగమే అన్నారు. ఎవరు ఎవరిపై కుట్ర చేశారు ? ఎందుకు కుట్ర చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారు ఈ నిజా నిజాలన్నీ తేటా తెల్లం కావాల్సిందన్నారు. కేంద్ర ప్రభుత్వం... సీబీఐతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాల్సిందే అన్నారు. ఇక్కడ ఉన్న పోలీసులంతా బీహారీలే అన్నారు. తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నారు డీకే అరుణ.  

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసారు అనేది పూర్తి అవాస్తవం... కట్టుకథ, కల్పితమన్నారు డీకే అరుణ. అనవసరంగా తమ మీద బురద జల్లుతున్నారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్  అవినీతి, అరాచక పాలన అందరికి తెలుసన్నారు. మంత్రి, అభద్రత భావానికి గురవుతున్నారన్నారు. మహబూబ్ నగర్‌లో రాక్షస పాలన రాజ్యం ఏలుతుందన్నారు. ఆయనను చంపించాల్సిన అవసరం తమకు కానీ తమ పార్టీకి గాని లేదన్నారు. శ్రీనివాస్ గౌడ్ అవినీతి పరుడు.. ఉద్యమకారుడు అనే ముసుగు కప్పుకున్నాడని అరుణ ఆరోపించారు. ఉద్యోగి గా ఉన్నపుడు రెండు సార్లు ఏసీబీకి పట్టుబడ్డారని విమర్శించారు. అవినీతి కేసులో పట్టుబడి సస్పెండ్ కూడా అయ్యారని విమర్శించారు. ఇదంతా కేసీఆర్ కుట్ర అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల ఓర్వలేకపోతున్నారన్నారు.

ఇవి కూడా చదవండి:

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దు