
ప్రజా సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని తెలిపారు. స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూంలకు, మరుగుదొడ్లకు తలుపులు లేక ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే చలికాలంలో హాస్టళ్లలోని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.చలి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్టు కూడా పంపిణీ చేయలేదన్నారు. కేంద్రం అందజేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని గొప్పలు చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉందని చెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు రైల్వే స్టేషన్ ఉన్న పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే పాత తాండూరు ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ మంత్రి ఎం చంద్రశేఖర్,వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు సదానంద గౌడ్,జిల్లా కార్యదర్శి వి రమేష్ కుమార్ తదితరులు హాజరయ్యా